Sunday, January 19, 2025

ప్రియుడి వేధింపులతో ప్రియురాలు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ప్రియుడి వేధింపులతో ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన జీడిమెట్ల పోలీసుస్టేసన్ పరిధిలోని న్యూ ఎల్బీనగర్ లో చోటు చేసుకుంది. షాపూర్ నగర్, ఎన్ ఎల్బీనగర్‌లో నివాసం ఉండే అఖిల (22) అనే అమ్మాయిని అదే ప్రాంతంలో నివాసం ఉండే అఖిల్ సాయిగౌడ్ 8 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. తొలుత అఖిల ప్రేమను తిరస్కరించడంతో చనిపోతానని అఖిల్ గౌడ్ బెదిరించడంతో తప్పని పరిస్దితిలో అఖిల ప్రేమించింది.

ఈ మధ్య అఖిల్ గౌడ్ అఖిలతో చిన్నచిన్న విషయాలపై గొడవపడి రోడ్డుపై వేధించడం ప్రారంభించాడు. పెళ్ళి చేసుకోనని తేల్చిచెపడంతో అఖిల తీవ్ర మనస్దాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. భాదితురాలి తండ్రి కుమార్ (54) ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అఖిల్ గౌడ్ ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News