Sunday, December 22, 2024

మైలార్‌దేవ్‌పల్లిలో బాంబు పేలుడు

- Advertisement -
- Advertisement -
Woman killed in Bomb blast at Mailardevpally
చెత్త ఏరుకునే మహిళ మృతి

హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాంబు పేలుడు ఆదివారం కలకలం సృష్టించింది. ఈ పేలుడులో చెత్త ఏరుకునే ఓ మహిళ మృతిచెందింది. పోలీసుల కథనం ప్రకారం….మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రంగముని, సుశీల దంపతులు రోడ్ల పక్కన చెత్త సేకరించి జీవనం సాగిస్తున్నారు. రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, ఆనంద్‌నగర్ పారిశ్రామిక వాడలో చెత్త సేకరించేందుకు వెళ్లారు. సుశీల భర్త రంగముని వేరే స్థలంలో చెత్త సేకరిస్తుండగా, సుశీల మైలార్‌దేవ్‌పల్లి, ఆనంద్‌నగర్‌లో రాళ్ల మధ్య ఉన్న చెత్తను తీసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగి పేలుడు సంభవించింది. దీంతో సుశీల శరీరం చిధ్రమై అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News