- Advertisement -
సంగారెడ్డి: జిల్లా పటాన్‌చెరు మండలంలో ఓ కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం మండలంలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ లారీ స్కూటీపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న మహిళ లారీ కింద పడి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొననారు.
Woman Killed in Road Accident in Patancheru
- Advertisement -