Sunday, January 19, 2025

చంద్రబాబు కానుకల పంపిణిలో అపశృతి..

- Advertisement -
- Advertisement -

గుంటూరు : టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోడ్‌షోలు, బహిరంగ సభలు జనం పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఆదివారం గుంటూరు చంద్రబాబు సభలో తొక్కిసలాటతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నాగులు రోజుల క్రితం కందుకూరులో రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే గుంటూరు తొక్కిసలాటలో ముగ్గురు దుర్మరణం చెందడం ఆందోళన కల్గిస్తోంది. సంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో తెలుగుదేశం పార్టీ వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. గుంటూరు వికాస్‌నగర్‌లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్‌టిఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కనుక పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పాల్గొని చ ంద్రబాబు నాయుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.

సభలో జనం ఒక్కసారిగా ముందుకు తోజుకురావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మహిళలు ప్రాణాలు విడిచారు. దీంతో తొక్కిసలాట మృతుల సంఖ్య మూడుకు చేరింది. క్షతగాత్రుల్లో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. చంద్రన్న కానుక పంపిణీ కి సంబంధించి గత పదిరోజులుగా టిడిపి ప్రచారం చేస్తుండడంతో జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కానుకలు తక్కువగా ఉండడం, జనం పెద్ద సంఖ్యలో తరలిరావడం, సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉండడంతో తొక్కిసలాట జరిగింది. మృతులను గోపిశెట్టి రమాదేవి, ఆసియాలుగా గుర్తించారు. మరో మహిళను గుర్తించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News