గుంటూరు: ఓ వ్యక్తి మొదటి భార్యకు పుట్టిన కవల పిల్లల్ని రెండో భార్య చిత్ర హింసలు పెట్టి.. అందులో ఒకరిని గొంతు నులిమి చంపేసిన ఘటన గుంటూరులోని ఫిరంగిపురంలో చోటు చేసుకుంది. ఎడ్లపాడు మండలం కొండవీడుకు గ్రామానికి చెందిన సాగర్‌కు గతంలో వివాహం జరిగి.. ఇద్దరు కవలలు ఉన్నారు. అయితే రెండేళ్ల క్రితం అతని మొదటి భార్య చనిపోవడంతో ఫిరంగిపురంకు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే లక్ష్మి మాత్రం రోజు మొదటి భార్య సంతానాన్ని చిత్రహింసలు పెట్టేది. బెల్టు, కర్రలతో కొట్టేది. తాజాగా ఆరేళ్ల చిన్న కుమారుడు కార్తిక్‌ను తలపై కర్రతో కొట్టి ఆ తర్వాత గొంతు నులిమి చంపేసింది. పెద్ద కుమారుడు ఆకాశ్‌ను కాలుతున్న పెనంపై కూర్చొబెట్టి కాల్చింది. సాగర్ కూడా ఈ చిన్నారులను హింసలు పెట్టడంలో సహకరించాడు. గోశాల విజయ అనే మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.