Tuesday, December 24, 2024

తల్లిని చంపి..సూట్‌కేసులో కుక్కి..పోలీసులకు లొంగిపోయిన కుమార్తె

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: వృద్ధురాలైన 70 ఏళ్ల తల్లిని చంపి ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి ఒక 39 ఏళ్ల మహిళ సూట్‌కేసుతో సహా పోలీసులకు లొంగిపోయిన దిగ్భ్రాంతికర సంఘటన బెంగళూరులో సోమవారం చోటుచేసుకుంది.

ఆగ్నేయ బెంగళూరులోని మైకో లేఔట్ పోలీసు స్టేషన్ పరిధిలోని బిలేకరహల్లి వద్ద ఒక అపార్ట్‌మెంట్‌లో ఈ సంఘటన జరిగింది. తన తల్లిని తానే చంపానంటూ ఆ మహిళ చెప్పడంతో పోలీసులే షాక్ తిన్నారు. మృతురాలిని బివా పాల్‌గా పోలీసులు గుర్తించారు. ఫిజియో థెరపిస్టుగా పనిచేస్తున్న ఆమె కుమార్తె సేనాలీ సేన్ ఈ ఘాతుకానికి పాల్పడింది. సేనాలీ సేన్ తన తల్లి, అత్తగారు, భర్త, మతిస్థిమితం లేని కుమారుడితో అపార్ట్‌మెంట్‌లోని ఒక ఫ్లాట్‌లో నివసిస్తోంది.

పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు&సోమవారం మధ్యాహ్నం సేనాలీ తన తల్లిని దుపట్టాతో గొంతు పిసికి చంపేసింది. ఆ తర్వాత శవాన్ని ఒక సూట్‌కేసులో కుక్కి, తన తండ్రి ఫోటోను అందులోనే ఉంచి సాయంత్రం కారు నడుపుకుంటూ పోలీసు స్టేషన్ చేరుకుంది. తల్లిని హత్య చేసే ముందు సేనాలీ 15-20 నిద్ర మాత్రలను తల్లి చేత మింగించింది. తల్లి స్పృహ కోల్పోగానే ఆమెను చంపివేసింది. తల్లికి, అత్తగారికి మధ్య రోజూ గొడవలు జరుగుతుండడమే హత్యకు కారణంగా తెలుస్తోందని పోలీసులు చెప్పారు.

సోమవారం ఉదయం కూడా వాళ్లిద్దరూ గొడవపడ్డారు. నిద్ర మాత్రలు మింగి చస్తానని తన తల్లి బెదిరించడంతో కోపం వచ్చిన సేనాలీ బలవంతంగా ఆమె చేత నిద్రమాత్రలు మింగించింది. తల్లికి, అత్తగారికి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడం తనను మానసికంగా దెబ్బతీస్తోందని సేనాలీ పోలీసులకు తెలిపింది. సేనాలీ వాంగ్మూలాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News