Friday, January 24, 2025

బెంగళూరు జైలులో మహిళ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తన ఇద్దరు పిల్లలను చంపిన మహిళ(29) గురువారం రాత్రి జైలులో ఆత్మహత్య చేసుకుంది. పరప్పన అగ్రహార పోలీసులు అసహజ మరణంగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జలహల్లి పోలీస్ పరిధిలోని రామ్ భోవి కాలనీకి చెందిన గంగా దేవి తన 7 ఏళ్ల కూతురు, 9 ఏళ్ల కుమారుడిని దిండుతో శ్వాస ఆడకుండా చేసి బుధవారం చంపేసింది. తర్వాత పోలీసు హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి హత్యకు సంబంధించిన వివరాలు తెలిపింది. తరువాత ఆమెను పోలీసులు అరెస్టు చేసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంచారు. కాగా గురువారం రాత్రి ఆమె టాయిలెట్ కు వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆ విషయాన్ని జైలులో ఉన్న ఇతర ఖైదీలు చాలా ఆలస్యంగా గమనించారు. ఆ తర్వాత వారు జైలు అధికారులకు తెలిపారు. తర్వాత ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల పరిశోధనలో గంగాదేవీ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని తేలింది. ఆమె నగరంలోని ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో ఉద్యోగిగా పనిచేశారు. ఆమె ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి. తమ పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆమె భర్త గత ఏడాది మార్చి నెలలో అరెస్టయ్యారు. అతడిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.

 

 

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News