Friday, November 22, 2024

పూరి గుడిసెకు రూ. 1 లక్ష కరెంట్ బిల్లు: వృద్ధురాలికి షాక్

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: కర్నాటకలోని కొప్పల్ నగరంలో నివసించే ఒక 90 ఏళ్ల వృద్ధురాలు తనకు వచ్చిన కరెంట్ బిల్లు షాక్‌కు గురైంది. కొప్పల్ నగరంలోని భాగ్యనగర్‌లో ఒక పూరి గుడిసెలో నివసించే 90 ఏళ్ల గిరిజమ్మకు కరెంట్ బిల్లు చూసి కళ్లు బైర్లుకమ్మాయి. ఈ నెల్క ఆమోకు అక్షరాలా రూ. 1 లక్ష కరెంట్ బిల్లు వచ్చింది. ప్రతి నెలల రూ. 70 లేదా రూ. 80 మాత్రమే వచ్చే కరెంట్ బిల్లు ఈనెల మాత్రం రూ. 1 లక్ష రావడంతో ఆమెను దిగ్భాంతికి గురిచేసింది.

ఒక పూట తిండికే కటకటలాడుతున్న తనకు రూ. 1 లక్ష కరెంట్ బిల్లు వచ్చిందని, ఈ కష్టం నుంచి తనను బయటపడేయాలంటూ ఆమె వీడియా ఎదుట భోరుమన్నారు. ఇదే విషయాన్ని విలేకరులు గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కెజె జార్జి దృష్టికి తీసుకెల్గా మీటరులో సమస్య కారణంగా ఈ పొరపాటు జరిగిందని, ఆ వృద్ధురాలు కరెంట్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇద్చరు.

మంత్రి స్పందనతో కంగారుపడిన గుల్బర్గా విద్యుత్ సరఫరా సంస్థ(జిస్కామ్) సిబ్బంది హుహుటిన ఆ వృద్ధురాలి గుడిసెకు పరుగులు తీశారు. మీటరులో సాంకేతిక సమస్యల కారణంగానే బిల్లులో ఈ పొరపాటు జరిగిందని ఆమె ఇంటిని సందర్శించిన ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ రాజేష్ మీడియాకు తెలిపారు. విద్యుత్ సిబ్బంది, బిల్లు కలెక్టర్ కారణంగానే ఈ తప్పు జరిగిందని ఆయన చెప్పారు. గిరిజమ్మ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని రాజేష్ చెప్పడంతో ఆ వృద్ధురాలు ఊపిరి పీల్చుకుంది. తన సమస్యను పరిష్కరించిన ఇఇ రాజేష్‌కు, జర్నలిస్టులకు ఆమె ధన్యవాదాలు తెలియచేసింది.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన ఎన్నికల వాగ్దానాలలో ఒకటైన గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందచేసే గృహ జ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News