Friday, December 20, 2024

50 మందిని పెళ్లి చేసుకున్న మహిళ.. బాధితుల్లో డిఎస్పితో సహా ముగ్గురు పోలీసులు

- Advertisement -
- Advertisement -

ఓ నిత్య పెళ్లి కూతురు హాఫ్ సెంచరీ కొట్టింది. అవును.. ఆమె ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకుంది. దీంతో పెళ్లిళ్లలో రికార్డు కొట్టింది. ఆమె ఖాతాలో సామానుల్యే కాదు.. ఓ డిఎస్పీతో సహా ముగ్గురు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఒకరికి తెలియకుండా ఇంకొకరిని.. అలా 50 మందిని పెళ్లి చేసుకుంటూ సెంచరీ దిశగా వెళ్తున్న క్రమంలో దొరికిపోయింది. వివరాల్లోకి వెళితే.. సంధ్య అనే మహిళను.. ‘డేట్ ద తమిళ్ వే అనే వెబ్ సైట్‌’లో చూసి తమిళనాడులోని తిరుపూర్‌కు చెందిన 35 ఏళ్ల ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లైన కొన్ని నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చి ఆమె సర్టిఫికెట్స్, ఆధార్ చెక్ చేశాడు. అందులో ఆమె భర్త పేరు వేరే ఉంది. దీంతో మోసపోయానని గ్రహించిన సదరు యువకుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. అందరూ ఆశ్యర్యపోయే విషయాలను వెల్లడించింది. సదరు యువకుడితోపాటు మొత్తం 50మందిని పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. ఒక డిఎస్పి, ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, కరూర్‌లో ఓ ఫైనాన్స్ ఉద్యోగితో సహా 50 మందిని పెళ్లాడినట్లు చెప్పింది. డబ్బులు, బంగారం టార్గెట్ గా ఈ పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News