Monday, January 20, 2025

శంషాబాద్ లో దారుణం.. మహిళను హత్య చేసి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో దారుణ సంఘటన జరిగింది. సాయి ఎన్ క్లేవ్ లో వద్ద ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. సాయి ఎన్ క్లేవ్ లో ఇళ్ల స్థలాల మధ్య మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేసి, పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News