మహబూబ్‌నగర్: భూమి వివాదంలో ఓ మహిళను మినీ వ్యాన్‌తో తొక్కించి హత్య చేసిన సంఘటన మహబూబ్‌నగర్‌లోని జడ్చర్ల ప్రాంతం బాలానగర్ మండంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మాచారం గ్రామస్థుడు యాదయ్య ప్రస్తుతం షాద్‌నగర్‌లో ఉంటున్నాడు. గొల్లపల్లిలో యాదయ్యకు ఎకరం ఎనిమిది గుంటల భూమి ఉంది. ఆరు నెలల కింద ఆ భూమిని యాదయ్య 80 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. అందులో తమ వాటా ఉందని చిన్నమ్మ కుమారులు అడిగిన ఇవ్వలేదు. యాదయ్య తన భార్య శైలజ, నిహారికతో కలిసి బైక్ పై కారుకొండలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్తుండగా ఏనుగొండలో టాటాఎస్‌తో వారిని వెంబడించాడు. మాచారం శివారులో వెనక నుంచి వాహనాన్ని ఢీకొట్టడంతో బైక్ పైనుంచి కిందపడిపోయాడు. యాదయ్య వెంటనే తేరుకొని కొంతదూరం పరుగులు తీశాడు. శైలజ కింద పడిపోవడంతో రెండో సారి ఆమెను ఢీకొట్టడంతో కిందపడిపోయింది. ఆమె పైనుంచి వాహనం పోనివ్వడంతో అక్కడికక్కడే మృతి చెందింది. నర్సింహులు వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు సిఐ శివ కుమార్, ఎస్‌ఐ లెనిన్‌లు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూమి అమ్మిన వ్యవహారంలో సమీప బంధువులే వాహనంతో ఢీకొట్టి తనని హత్య చేసేందుకు ప్రయత్నించారని యాదయ్య ఫిర్యాదు చేశాడు.