Friday, November 15, 2024

గచ్చిబౌలిలో మహిళాపై హత్యాచారం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం…గౌలిదొడ్డి, కేశవనగర్, వడ్డెర బస్తీకి చెందిన కాశమ్మ(40) అనే మహిళ ఈ నెల 25వ తేదీన పాత ఇనుప తుక్కు సామాగ్రిని సేకరించేందుకు నిర్మాణంలో ఉన్న భవనంలోకి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమెపై దుండగులు లైంగిక దాడి చేసి, బండరాయితో కొట్టి హత్య చేశారు. బాధిత మహిళ కూతురు లక్ష్మి తమ తల్లి కాశమ్మ కన్పించడంలేదని ఆదివారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే గుర్తుతెలియని మహిళ మృతదేహం నానక్‌రాంగూడలో లభ్యమైనటు తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా మిస్సింగ్ కేసు నమోదు చేసిన కాశమ్మగా గుర్తించారు. వెంటనే క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. సంఘటన స్థలంలో సేకరించిన ఆధారాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నట్లు తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ ఎసిపి శ్రీనివాస్ తెలిపారు.

గవర్నర్ సీరియస్…
మహిళపై అత్యాచారం, హత్య చేసిన సంఘటనపై గవర్నర్ తమిళీసై సౌందరరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 48గంటల్లో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డిజిపి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News