Monday, December 23, 2024

సిద్దిపేటలో మహిళ దారుణ హత్య.. గొంతు కోసి, శరీరం నుంచి కాళ్లు వేరుచేసి..

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: జిల్లాలో ఓ మహిళ దారుణంగా హత్య చేయబడింది. ములుగు మండలం బండమైలారంలో వెంకటమ్మ(40) అనే మహిళను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ప్లాస్టిక్ సామాగ్రి అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్న మహిళను గొంతు కోసి, శరీరం నుంచి కాళ్లను వేరు చేసి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. మృతురాలుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతంలోన ఆమె భర్త మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై గజ్వేల్ ఎసిపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News