గడ్చిరోలి ( మహారాష్ట్ర): భద్రతాదళాలపై దాడుల్లో ప్రమేయం ఉన్న మహిళా నక్సలైట్ రాజేశ్వరి అలియాస్ కమలా పడ్గా గోటా (30) ను మహారాష్ట్రఛత్తీస్‌గఢ్ సరిహద్దు గచ్చిరోలిలో ఆదివారం పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఆమె తలపై రూ.6 లక్షల రివార్డు ఉందని పోలీస్‌లు చెప్పారు. 2023 ఏప్రిల్‌లో భమ్రగడ్‌లో కేడ్మర అటవీ ప్రాంతంలో పోలీస్‌లకు, మావోయిస్టులకు మధ్య జరిగిన పోరులో గోటా ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ లోని కచలారం అటవీ ప్రాంతంలో పోలీస్ దళాలపై కాల్పులకు పాల్పడిన సంఘటన జరిగింది.
ఇవే కాకుండా ఇతర హింసాత్మక సంఘటనల్లో పడ్గా ప్రమేయం ఉంది. 2019లో అరెస్ట్ అయిన సంవత్సరం తరువాత విడుదలైంది. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నేతృత్వంలో టైలరింగ్ టీమ్‌లో ఏరియా కమిటీ మెంబర్‌గా ఆమె ఉంటోంది. ఎస్‌పి నీలోత్పల్ మార్గదర్శకత్వంలో గచ్చిరోలి పోలీస్‌లు గత ఏడాది జనవరి నుంచి విస్తృతంగా గాలింపు చేపట్టి కరడుగట్టిన 73 మావోయిస్టులను అరెస్ట్ చేయడమైందని పోలీస్‌లు ఒక ప్రకటనలో తెలిపారు.