Wednesday, January 22, 2025

శానిటరీ ప్యాడ్స్ అర్డర్ చేస్తే స్విగ్గీ ఏం చేసిందంటే…

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: రుతు స్రవా సమయంలో మహిళలకు చాక్లెట్లు తింటే కొంత సాంత్వన లభిస్తుందని చెబుతుంటారు. ఇది నిజమో..కాదో తెలియదు కాని స్విగ్గీ మాత్రం ఒక మహిళను సంతోషపరిచే కానుక అందచేసింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో శానిటరీ ప్యాద్స్ ఆర్డర్ చేసిన ఒక మహిళకు వాటితోపాటు చాకలెట్ కుకీస్ బోనస్‌గా అందాయి. సమీర అనే మహిళ తన ట్విటర్ హ్యాండిల్‌లో ఈ విషయాన్ని తెలియచేస్తూ తాను శానిటరీ ప్యాడ్స్ ఆర్డర్ చేశానని, అయితే వాటితోపాటు బ్యాగు అడుగు భాగంలో కొన్ని చాకలెట్ కుకీస్ కూడా తనకు అందాయని తెలిపారు.

ఈ పని చేసింది స్విగ్గీనా లేక దుకాణదారుడా తనకు తెలియదని ఆమె పేర్కొన్నారు. కాగా..తన కస్టమర్ పట్ల స్విగ్గీ చూపిన ఔదార్యం నెటిజన్ల మనసు దోచుకుంది. స్విగ్గీని అభినందిస్తూ పలువురు తమ హర్షం వ్యక్తం చేశారు. ఈ కామెంట్లకు స్విగ్గీ కూడా అక్కడే స్పందించింది. మీ రోజు మీకు సంతోషదాయకంగా ముందుకు సాగాలని ఆశిస్తున్నాము సమీరా అంటూ స్విగ్గీ ఇచ్చిన జవాబు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News