Thursday, December 19, 2024

అన్యాయాన్ని ప్రశ్నించినందుకు మహిళపై దాడి.. వివస్త్రను చేసి ఊరేగింపు

- Advertisement -
- Advertisement -

బెలగావి(కర్నాటక): ఒక మహిళను నగ్నంగా ఊరేగించిన దృశ్యాలతో కూడిన వీడియో సోలషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. సుమారు ఏడు నెలల క్రితం జరిగినట్లుగా చెబుతున్న ఈ దారుణ ఘటన ఇటీవలే వెలుగు చూసింది. బాధితురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు గురువారం తెలిపారు. 2023 జులై 31న ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ప్రభుత్వం తనకు కేటాయించిన మూడు ఎకరాల భూమిలో అర ఎకరాన్ని కొందరు కబ్జా చేయగా బాధితురాలు దాన్ని ప్రశ్నించారు. అందుకు ఆగ్రహించిన ప్రత్యర్థులు బాధితురాలిని, ఆమె కుమారుడిని చితకబాదారు. అంతేగాక బాధితురాలిని గ్రామంలో నగ్నంగా ఊరేగించారు. ఈ శిషయాన్ని పోలీసులకు చెబితే మొత్తం కుటుంబాన్నే అంతం చేస్తామని కూడా ప్రత్యర్థులు ఆమెను బెదిచించారని ఫిర్యాదుదారు ఆరోపించారు.

బాధితురాలి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. బెలగావి జిల్లా యంత్రాంగానికి చెందిన సీనియర్ అధికారులు హుటాహుటిన గ్రామాన్ని చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఇటువంటిదే మరో సంఘటన గత ఏడాది డిసెంబర్ 11న కర్నాటకలో చోటుచేసుకుంది. బెలగావి జిల్లాలోని వంటమూరి గ్రామంలో వేరే కులం అమ్మాయిని తీసుకుని వెళ్లిపోయినందుకు ఆ యువకుడి తల్లిపై మరో కులానికి చెందిన వారు దాడి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News