Wednesday, January 22, 2025

చెప్పుల దండతో యువతి ఊరేగింపు..

- Advertisement -
- Advertisement -

బెలగావి ( కర్ణాటక ) : అనేక మందిని మోసగిస్తున్న మాయలేడిగా ( హానీట్రాప్) ఆరోపణలు ఎదుర్కొంటున్న 38 ఏళ్ల యువతిపై దాడి చేయడమే కాకుండా, చెప్పుల దండతో ఆమెను ఊరేగించిన సంఘటన కర్ణాటకలో బయటపడింది. బెలగావి జిల్లా ఘటప్రభ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటన వైరల్ కూడా అయింది. అనేక మందిని ప్రలోభపరిచి ( హానీట్రాప్ ) డబ్బులు గుంజుతోందని , కొంతమంది కోపంతో ఆమె ఇంటికి వెళ్లి గొడవ పడ్డారని, ఆమెను కొట్టడమే కాకుండా మెడలో చెప్పుల దండ వేసి గ్రామంలో ఊరేగించారని పోలీస్‌లు చెప్పారు.

ఈ సంఘటనపై తమకు ఎమర్జెన్సీ కాల్ రావడంతో తక్షణం అక్కడకు వెళ్లి ఆమెను రక్షించడమైందని తెలిపారు. ఈ దాడిలో ఆమెకు స్వల్ప గాయాలు కావడంతో సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీస్‌లు కేసు నమోదు చేసి 13 మందిని అరెస్ట్ చేశారు. ప్రాథమికంగా బాధితురాలు ఫిర్యాదు చేయడానికి ఒప్పుకోలేదని, ఇది తమ అంతర్గత వ్యవహారమని తమలో తాము పరిష్కరించుకుంటామని చెప్పినట్టు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఈ సంఘటన దృశ్యాలు వైరల్ కావడంతో ఆమె ఫిర్యాదు చేసిందని చెప్పారు. దీని ఆధారంగా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని బెలగావి ఎస్‌పి భీమశంకర్ గులేడ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News