Thursday, December 26, 2024

టాప్ విప్పేసి… సిబ్బందిని కొరికి: విమానంలో మహిళ వీరంగం (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: రష్యాలో ఒక మహిళ విమానంలో హల్ చల్ చేసింది. ప్రయాణికులు అందరి ముందు టాప్ తీసేసి అర్ధనగ్నంగా నిలబడడమేకాక విమాన సిబ్బందిలో ఒకరిని నోటితో కొరికి కాక్‌పిట్‌లోకి చొరబడేందుకు ఆమె ప్రయత్నించింది. రష్యాలోని స్టావ్‌రోపోల్ నుంచి రాజధాని మాస్కోకు వెళుతున్న విమానంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆంజెలికా మాస్కివితినా అనే ఒక ప్రయాణికురాలు విమానం ఆకాశంలో కుదుపులకు లోనవుతున్న సమయంలో టాయిలెట్‌లో సిగరెట్ తాగింది. దీనికి విమాన సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో మీరంతా చావాలంటూ ఆమె బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు శాపనార్ధాలు పెట్టింది.

చిన్న పిల్లలతో సహా ప్రయాణికులు అందరి సమక్షంలో ఆమె తన టాప్ విప్పేసింది. కాక్‌పిట్‌లోకి ప్రవేశించడానికి ఆమె ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆమె ఒక వ్యక్తి చేతిని కొరికి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ప్రయాణికుల సాయంతో సిబ్బంది ఆమె రెండు చేతులను ప్లాస్టిక్ తాళ్లతో కట్టేసి కూర్చోపెట్టారు. 33,000 అడుగుల ఎత్తున ఈ హైడ్రామా జరిగింది. విమానం మాస్కో విమానాశ్రయంలో దిగిన వెంటనే విమాన పైలట్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News