Saturday, December 21, 2024

శివకుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ గాంధీభవన్‌లో మహిళల నిరసన

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణ్‌పేట్ అసెంబ్లీ స్థానానికి మాజీ డిసిసి అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డికి ఎట్టిపరిస్థితుల్లో కూడా టికెట్ ఇవ్వొద్దంటూ మహిళా సంఘం నాయకుల నిరసన గళంతో హోరెత్తాయి. కీచక ప్రవృత్తి కలిగిన అమ్మాయిలతో అనుచితంగా ప్రవర్తన, నగరంలో పంజాగుట్ట పీఎస్‌లో ఐపీసీ 376, 417, 420,506 సెక్షన్ల కింద శివకుమార్ రెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. నేర చరిత్ర, నీచ సంస్కృతికి కలిగి కాంగ్రెస్ రెండో జాబితాలో టికెట్ కోసం తీవ్ర యత్నాలు సాగిస్తున్న అతనికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయంగా ప్రోత్సాహం, వత్తాసు పలుకుతున్నాడంటూ మహిళలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. శుక్రవారం నాంపల్లిలోని గాంధీభవన్ ప్రాంగణంలో నేర చరిత్ర కల్గిన కంభం శివకుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి, పార్టీ అభ్యర్థిత్వం ఖరారు చేయవద్దు, రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్, రేవంత్ రెడ్డి తమ వద్దకు వచ్చి శివకుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వబోం అంటూ స్పష్టత ఇవ్వాలంటూ నినాదాలు మిన్నంటాయి.

ఈ సందర్భంగా శివకుమార్ రెడ్డి చిత్రపటాన్ని నిరసనలో ప్రదర్శించారు. మహిళల పట్ల అనుచితంగా,అభ్యంతకరంగా ప్రవర్తిస్తుంటారని, ఓ మహిళా రేప్ కేసుల్లో ప్రమేయం ఉందని, వివిధ క్రిమినల్ కేసుల్లో కోర్టుల్లో విచారణ ఎదుర్కొంటున్న శివకుమార్ రెడ్డికి పార్టీ నుంచి బహిష్కరించాలి, టికెట్ ఇవ్వవద్దు, బాధిత మహిళలకు న్యాయం జరగాలంటూ మహిళా నాయకురాలు ఇందుభాయి డిమాండ్ చేశారు. శివకుమార్‌రెడ్డి అరెస్టు చేయాలంటూ ధర్నా, నిరసనలు నిర్వహించామని, ఇటీవలే నగర మాజీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్‌కు కలిసి ఫిర్యాదులు చేసిన ఫలితం లేదని వామె వాపోయారు. లోయర్ కోర్టు, ఉన్నత న్యాయస్థానం కూడా శివకుమార్ రెడ్డి బెయిల్‌ను తరిస్కరించిందని మహిళలు పేర్కొన్నారు. అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం మహిళలను అన్యాయం చేసినట్లే అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News