Sunday, December 22, 2024

మహిళను చెట్టుకు కట్టేసి..జుట్టు కత్తిరించి

- Advertisement -
- Advertisement -

తన గ్రామానికి చెందిన పర పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న ఆరోపణపై ఒక మహిళను చెట్టుకు కట్టేసి, జుట్టు కత్తిరించి, ముఖానికి మసి పూసిన పంచాయతీ పెద్దలను పోలీసులు అరెస్టు చేశారు. హతీగావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఛోట్కీ ఇబ్రహింపూర్ గ్రామంలో ఆదివారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధింది 15 మందిని అరెస్టు చేసిన పోలీసులు మరో ఐదుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ముంబైలో పనిచేస్తున్న బాధితురాలి భర్త సెలవులపై గ్రామానికి తిరిగిరాగా తన భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త ఫిర్యాదుపై ఆ మహిళ కుటుంబం సమక్షంలో ంపచాయతీ ఏర్పాటు చేశారు.

పంచాయతీ ఆదేశాల మేరకు గ్రామస్తులు ఆ మహిళను చెట్టుకు కట్టేసి ఆమె జుట్టు కత్తిరించారు. ఆమె ముఖానికి మసి పూసినట్లు అదనపు ఎస్‌పి సంజయ్ రాయ్ తెలిపారు. కాగా..నలుగురు పిల్లల తండ్రయిన ఆ మహిళ ప్రియుడు అడ్డుపడేందుకు ప్రయత్నించగా అతడిని గ్రామస్తులు చితకబాదారు. దీంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు గ్రామాన్ని చేరుకుని బాధిత మహిళను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 20 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 15 మందిని అదుపులోకి తీసుకోగా పరారీలో ఉన్న మిగిలిన ఐదుగురి కోసం గాలిస్తున్నట్లు ఎఎస్‌పి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News