Saturday, December 28, 2024

కాలకృత్యాలకు వెళ్లిన మహిళపై అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

పాల్వంచ :  కాలకృత్యాలకు వెళ్లిన మహిళపై  యువకుడు అత్యాచారం చేసిన ఘటన పాల్వంచ మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే.. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..  మండల పరిధి లక్షిదేవిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ పాల్వంచలో గల తన బంధువుల ఇంటిలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి శనివారం సాయంత్రం తన స్వ గ్రామానికి వెళ్ళటానికి పాల్వంచ నటరాజ్ సెంటర్‌లో ఓ ఆటోలో ఎక్కింది. ఈ క్రమంలో సదరు మహిళ ఇంటి దగ్గర దిగింది.

డ్రైవర్ ఆటో వారి ఇంటి పక్కన ఉన్న వాటర్ ట్యాంకులో బాటిల్ లో నీరు నింపుకోవటానికి వెళ్ళాడు. ఈ క్రమంలో మహిళ కాల కృత్యాలు తీర్చుకోవటానికి బాత్రూమ్‌ కు వెళ్ళింది. దీనిని గమనించిన డ్రైవర్ ప్రవీణ్ ఆమె పై బలత్కారం చేశాడు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. జరిగిన సంఘటనను ఆమె తన చెల్లికి తెలిపింది. మహిళ చెల్లి ఫిర్యాదు మేరకు డ్రైవర్ ప్రవీణ్ పై పాల్వంచ గ్రామీణ ఎస్‌ఐ. కె. శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News