- Advertisement -
నాగర్‌కర్నూల్: జిల్లాలోని ఊర్కొండ మండలం ఊర్కొండపేటలో దారుణం చోటు చేసుకుంది. దైవ దర్శనానికి వచ్చిన ఓ యువతిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. శనివారం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన యువతి, ఆమె బంధువు ఇక్కడి ఆంజనేయస్వామి ఆలయంలో పూజరు చేయడానికి వచ్చారు. అనంతరం రాత్రి అక్కడే నిద్ర చేశారు. ఉదయం యువతి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి క్రమంలో ఆమెను కొందరు అడ్డగించారు. ఆమె బంధువును కొట్టి.. చేతులు కట్టేశారు. అనంతరం ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. నిందితులు ఊర్కొండ గ్రామానికి చెందిన ఎనిమిది మందిగా గుర్తించిన పోలీసులు వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగితా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
- Advertisement -