Saturday, February 22, 2025

హోటల్ మిద్దెపైన మహిళపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

కర్నాటక రాజధాని నగరమైన బెంగళూరులోని కొరమంగళలో ఉన్న ఓ హోటల్ మిద్దెపైన 33 ఏళ్ల మహిళపై గురువారం అర్ధరాత్రి సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆ మహిళ కేటరింగ్ సర్వీసెస్‌లో పనిచేస్తుంటుంది. ఈవెంట్స్‌లలో ఆహారం వడ్డిస్తుంటుంది. గురువారం రాత్రి ఆమె జ్యోతి నివాస్ కాలేజ్ జంక్షన్ వద్ద వాహనం కోసం నిల్చుని ఉండగా 20 ఏళ్ల వయస్సులో ఉన్న నలుగురు ఆమె వద్దకు చేరి మాటలు కలిపారు. పైగా హోటల్‌లో డిన్నర్‌కు ఆహ్వానించారు. డిన్నర్ అయ్యాక వారు ఆమె పట్ల అడ్వాన్స్ అయ్యారు. ఆ ప్రైవేట్ హోటల్ డాబాపైన వారామెపై అత్యాచారం చేశారు.

విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. పైగా శుక్రవారం తెల్లవారు జామున ఆరు గంటల ప్రాంతంలో ఆమెను వదిలిపెట్టారు. ఇంటికి చేరుకున్న ఆమె విషయమంతా తన భర్తకు తెలిపింది. నిందితులంతా వేరే రాష్ట్రానికి చెందిన వారు. హోటల్స్‌లో పనిచేసేవారు. ‘ఫిర్యాదు అందాక మేము భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 70(సామూహిక అత్యాచారం) కింద ముగ్గురు నిందితులను అరెస్టు చేశాము. నాలుగో నిందితుడిని కూడా గుర్తించాము. అయితే అతడిప్పుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునే పనిలో ఉన్నాము’ అని పోలీస్ జాయింట్ కమిషనర్(తూర్పు) రమేశ్ బానోత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News