Monday, December 23, 2024

నగరంలో మరో అత్యాచారం… స్నేహితుడే..

- Advertisement -
- Advertisement -

Woman rapped by friend in Hyd's Bachupalli
మనతెలంగాణ/హైదరాబాద్: ఓ యువతితో స్నేహంగా మెలుగుతూ అత్యాచారానికి పాల్పడిన ఘటన బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 13న స్నేహితులతో కలిసి రాత్రి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కి యువతి వెళ్లింది. రాత్రి ఏడున్నర గంటల సమయంలో స్నేహితులందరూ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని పార్టీ ముగిసిన అనంతరం ఆ యువతిని రోషన్ అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి రాత్రి 11 గంటల సమయంలో ప్రగతి నగర్‌లోని యువతి ఇంటి వద్ద వదిలి వెళ్లాలని నిశ్చయించుకున్నారు.అనుకున్నట్లుగానే రాత్రి 11.30 గంటలకు యువతిని ఇంటి వద్ద వదిలి తెల్లవారుజాము వరకు అక్కడే ఉన్నారు. ఈక్రమంలో 14వ తేదీ తెల్లవారుజామున రోషన్ స్నేహితులిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం యువతి ఉదయం ఐదు గంటల సమయంలో నిద్రలోకి జారుకోగా అదే అదునుగా భావించిన రోషన్ ఉదయం 6 గంటల సమయంలో నిద్రలో ఉన్న యువతిపై అత్యాచారం చేశాడు. యువతి వెంటనే తేరుకుని చుట్టుపక్కల వారిని పిలవగానే రోషన్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధిత యువతి బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఈనెల 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చిందని, ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు పేర్కొంటున్నారు.

Woman rapped by friend in Hyd’s Bachupalli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News