- Advertisement -
అన్నదమ్ముల మధ్య గొడవ మహిళ సర్పంచ్ ఆత్మ హత్య యత్నానికి దారి తీసిన వైనం…
కేశంపేట మండలంలో ఓ మహిళ సర్పంచ్ ఆత్మహత్య యత్నం…
రంగారెడ్డి: ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ ఓ గ్రామ మహిళా సర్పంచ్ ఆత్మహత్య యత్నానికి దారి తీసిన ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే దేవి నవరాత్రులలో భాగంగా అమ్మవారి విగ్రహం వద్దకు పూజకు వెళ్లిన మహిళ సర్పంచ్ భర్త, అతడి అన్నతో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెంది ఆ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -