Wednesday, January 22, 2025

చిన్నారిపై అత్యాచారానికి ప్రోత్సాహం.. తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో ఏడేళ్ల కూతురిపై అత్యాచారానికి ప్రోత్సహించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆమెకు ఆరునెలల కఠిన కారాగార శిక్ష కూడా విధించారు. తిరువనంతపురం ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి ఆర్ రేఖ ఈ మేరకు తీర్పుచెప్పారు. ఆ మహిళకు రూ. 20 వేలు జరిమానా కూడా విధించారు. ఆమె ఆ జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో ఆరు నెలల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. నిందితురాలు తన భర్తను విడిచిపెట్టి శిశుపాలన్ అనే వ్యక్తితో సహజీవనం గడిపింది. 2018 మార్చి నుంచి 2019 సెప్టెంబర్ మధ్య కాలంలో ఏడేళ్ల కూతురిపై అత్యాచారం జరిగింది. ఈ విధంగా శిశుపాలన్‌ను అత్యాచారానికి ప్రోత్సహించినట్టు ఆధారాలు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News