Sunday, December 22, 2024

కోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో కోతుల బెడద రోజు రోజుకి పెరిగిపోతుంది. అడవులను విడిచి గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గ్రామాలను కోతుల ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. ఆకలితో అలమటిస్తూ పల్లె ప్రజలపై దాడులు చేసి వారిని తీవ్రంగా గాయపరుస్తున్నాయి. పంట పొలాలకు నాశనం చేసి రైతులకు తీవ్ర నష్టాలను తెచ్చి పెడుతున్నాయి. ఇవాళ  కోతుల దాడిలో మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన సూర్యపేట జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని జాజిరెడ్డిగూడెం మండలం పర్సాయపల్లి గ్రామంలో ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్తున్న మహిళపై కోతులు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి కోతులను బెదిరి కొట్టారు. గాయపడిన మహిళను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామాల్లో కోతుల బెడద ప్రజలకు తీవ్రమైన సమస్యగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News