Saturday, December 21, 2024

మెట్రో స్టేషన్ లిఫ్టులో మహిళకు లైంగిక వేధింపులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ మెట్రో స్టేషన్ లో మహిళను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కలకలం సృష్టించింది. ఢిల్లీలోని జసోలా మెట్రో స్టేషన్ లో ఏప్రిల్ 04న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 04న ఢిల్లీ మెట్రోస్టేషన్ లోని లిఫ్టులో మహిళను లైంగికంగా వేధించినందుకు ఓ యువకుడిని ఢిల్లీ పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు.

నిందితుడు రాజేష్ కుమార్ మెట్రో స్టేషన్ లిఫ్టులో తన ప్రైవేట్ పార్ట్స్ ను బయటపెట్టి, ఓ మహిళను తాకినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధిత మహిళ ఢిల్లీ మెట్రో పోలీసుకు ఫిర్యాదు చేసింది. సెక్యూరిటీ కెమెరా ఫుటేజీ, లోకల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రాజేశ్ ని పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News