Wednesday, January 22, 2025

బెంగళూరు ఎయిర్‌పోర్టులో మహిళ షర్ట్ విప్పించిన సెక్యూరిటీ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: సెక్యూరిటీ చెక్ నిమిత్తం ఒక మహిళా ప్రయాణికురాలిని షర్ట్ విప్పాలంటూ సెక్యూరిటీ సిబ్బంది ఆదేశించిన ఘటన బెంగళూరులో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అయితే..ఈ సంఘటనపై తాము తీవ్రంగా విచారిస్తున్నామని, దీనిపై ఆపరేషన్స్ విభాగం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని విమానాశ్రయం అధికారులు చెప్పారు.

కాగా.. బాధితురాలు క్రిషని గధ్వి కెంపెగౌడ విమానాశ్రయంలో తాను అనుభవించిన వేదనను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో మంగళవారం సాయంత్రం వివరించారు. సెక్యూరిటీ చెక్ సందర్భంగా తన చొక్కా విప్పమని సిబ్బంది తనను ఆదేశించారని ఆమె తెలిపారు. షర్ట్ లేకుండా కేవలం లోదుస్తులతో తోటి ప్రయాణికులు చూస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది ముందు నిలబడడం చాలా అవమానకరంగా అనిపించింది.

ఇలాంటి దుస్థితి ఏ మహిళకూ రాకూడదు. మహిళ అని కూడా చూడకుండా షర్ట్ విప్పించి అలా నిలబెట్టడం ఎంతవరకు సమంజసం అని ఆమె అధికారులను ప్రశ్నించారు. అయితే క్రిషాని తన ప్రయాణ వివరాలను మాత్రం పోస్ట్‌లో వెల్లడించలేదు. తనను తాను విద్యార్థిగా, సంగీత కళాకారిణిగా ఆమె పరిచయం చేసుకున్నారు.

ఈ సంఘటనపై స్పందించిన బెంగళూరు విమానాశ్రయ అధికారులు ఆమెకు క్షమాపణ తెలిపారు. ఈ సంఘటనపై తాము విచారం వ్యక్తం చేస్తున్నామని, ఇలాంటిది జరిగి ఉండకూడదని వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని సెక్యూరిటీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిఐఎస్‌ఎఫ్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు కూడా అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News