Monday, December 23, 2024

క్యాబ్ డ్రైవర్‌పై మహిళ కాల్పులు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఓ మహిళ డ్రైవర్ తనను కిడ్నాప్ చేస్తున్నాడనే అనుమానంతో అతడిపై కాల్పులు జరిపింది.దీంతో డ్రైవర్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా లోని టెక్సాస్‌లో ఈ సంఘటన జరిగింది. టెక్సాస్‌కు చెందిన ఓ మహిళ ఎల్ పాసో కౌంటీలో ఉన్న మిత్రుడిని కలుసుకునేందుకు ఉబర్ క్యాబ్‌లో బయలుదేరింది. కొంత దూరం వెళ్లిన తరువాత హైవేపై ఉన్న బోర్డులను చూసి క్యాబ్ వేరే మార్గంలో వెళ్తున్నట్టు ఆందోళనకు గురైంది. డ్రైవర్ తనను కిడ్నాప్ చేసి మెక్సికో వైపు తీసుకెళ్తున్నట్టు అనుమానించింది.

వెంటనే తన బ్యాగులో ఉన్న తుపాకీ తీసి డ్రైవర్‌పై కాల్పులు జరిపింది. దీంతో డ్రైవర్ మెడకు, చేతికి తీవ్ర గాయాలు కావడంతో పాటు కారు అదుపు తప్పి ఆగిపోయింది. పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. అదే సమయంలో రక్తపు మడుగులో ఉన్నడ్రైవర్ ఫోటోలను తన బాయ్ ఫ్రెండ్‌కు పంపింది. దీనిపై పోలీస్‌లు దర్యాప్తు చేపట్టారు. కేవలం అనుమానం తోనే ఆమె కాల్పులు జరిపిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమెపై హత్యాయత్నం నేరం నమోదు చేశారు. ఉబర్ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. భవిష్యత్తులో ఆమె ఉబర్ సేవలు వినియోగించకుండా నిషేధం విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News