Sunday, December 22, 2024

మణిపూర్‌లో స్కూళ్లు తెరిచిన మరునాడే.. పాఠశాల బయట మహిళ కాల్చివేత

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాజ్వాలలు ఇంకా ఆరలేదు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఓ స్కూల్ బయట గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను కాల్చి చంపారు. గురువారం ఉదయం స్థానిక శిశు నిష్తా నికేతన్ పాఠశాల ఎదుట ఈ సంఘటన జరిగింది. మృతురాలెవరో ఇంకా వివరాలు తెలియరాలేదు.గత రెండు నెలలుగా మూతపడి ఉన్న స్కూళ్లను బుధవారమే తిరిగి తెరిచారు. అయితే మరునాడే ఈ సంఘటన జరగడంతో ఆ ప్రాంతంలో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి.

బుధవారం థౌబల్ జిల్లాలో ఇండియన్ రిజర్వు బెటాలియన్ కు చెందిన ఓ జవాను ఇంటిని అల్లరి మూక దహనం చేసింది. పోలీస్ విభాగానికి చెందిన ఆయుధశాల నుంచి తుపాకులు ఎత్తుకెళ్లడానికి చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టారన్న ఆగ్రహంతో ఈ దుశ్చర్యకు పాల్పడింది. అటు వంగ్బాల్ వద్ద ఉన్న మూడో ఐఆర్‌బీ క్యాంపు లోకి చొరబడి ఆయుధాలను లూటీ చేసేందుకు మంగళవారం రాత్రి సుమారు 800 మంది గుంపుగా రాగా, వారిని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘర్షణల్లో ఓ యువకుడు మరణించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News