Monday, January 20, 2025

ఇన్ స్టా రీల్స్ కోసం యువతి.. రూ. 15,500 జరిమానా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:ప్రస్తుతం ఇన్ స్టా రీల్స్ పిచ్చితో యువతీ యువకులు రకరకాల సంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇస్టా రీల్స్ కోసం కొందరు యువతీ యువకులు ఎంతటి సహసాలు చేయడానికైన వెనుకాడటం లేదు. కొందరు బైక్ లపై, రైల్వే ట్రాక్ లపై వీడియోలు చేస్తే.. మరికొందరు కొండలు, ఎత్తైన ప్రమాదకర ప్రదేశాలల్లో రీల్స్ చేస్తున్నారు. తాజాగా ఓ యువతి కారు బానెట్ పై కూర్చొని ఇన్ స్టా రీల్స్ చేసింది.

పెళ్లి కుమార్తె డ్రెస్ లో లగ్జరీ కారు బానెట్ పై యువతి కూర్చొని రీల్స్ చేసింది. యువతి ఇన్ స్టా గ్రాం లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఈ విషయం ట్రాఫిక్ పోలీసులకు తెలియడంతో యువతి కారు నెంబరు సహయంతో ఆమెను గుర్తించి రూ. 15,500 జరిమానా విధించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ జిల్లాలోని సివిల్ లైన్ ఏరియాలో చోటు చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News