Sunday, December 22, 2024

మోసం చేశాడని ప్రియుడి గొంతు కోసిన ప్రియురాలు..

- Advertisement -
- Advertisement -

Woman slits her lover throat in Langer Houz

హైదరాబాద్: ఓ యువతి తనను మోసం చేశాడని ప్రియుడి గొంతు కోసిన ఘటన ఆదివారం నగరంలోని లంగర్ హౌస్ లో చోటుచేసుకుంది. లంగర్ హౌస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి ప్రాంతానికి చెందిన ఓ యువతి(24), గాంధీనగర్ కు చెందిన కృష్ణ(38)లు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే, మరో మహిళతో కృష్ణ సహజీవనం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న సదరు యువతి.. ఆదివారం వారిద్దరూ సానిహిత్యంగా గడుపుతున్న ప్రాంతానికి వెళ్లింది. వారిద్దరినీ అలా చూసి కోపంతో అతనిపై కత్తితో దాడి చేసి గొంతు కోసింది.రక్తపుమడుగులో ఉన్న కృష్ణను స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం లంగర్ హౌస్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

Woman slits her lover throat in Langer Houz

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News