Sunday, December 22, 2024

మర్మాంగాల వద్ద బంగారం దాచుకొని పట్టుబడిన మహిళ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: మర్మాంగాల వద్ద బంగారం దాచుకొని బంగ్లాదేశం నుంచి భారత్‌కు వచ్చిన మహిళను సరహద్దుల వద్ద బద్రతా సిబ్బంది పట్టుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. భద్రతా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం… ముంబయికు చెందిన మహిళ వస్త్ర వ్యాపారం నిమిత్తం ఆమె బంగ్లాదేశ్‌కు వెళ్లింది. బంగ్లాదేశ్ నుంచి తిరిగి వస్తుండగా అర్షద్ అనే వ్యక్తి ఆమెకు బంగారాన్ని బంగ్లా నుంచి భారత్ తీసుకొస్తే పది వేలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఆమె బంగారాన్ని మర్మాంగాల వద్ద పెట్టుకొని సరిహద్దు దాటుతుండగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. స్కానింగ్ చేయగా బ్యాగ్‌లో రెండు బంగారు బిస్కెట్లు, మర్మాంగాల వద్ద ఒక బంగారు బిస్కెట్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బంగారం ఇచ్చిన వ్యక్తి వివరాలు గురించి విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News