Thursday, January 23, 2025

కలెక్టరేట్ సాక్షిగా మహిళ ఆత్మహత్యాయత్నం..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సాక్షిగా ఓమహిళ ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం కలకలం రేపింది. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూమిని కాజేసేందుకు యత్నిస్తున్నారని ఆమె ఆరోపించింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం కొంగరకలాన్‌లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లికి చెందిన జయశ్రీ బ్లేడుతో తన చెయ్యి కోసుకునేందుకు యత్నించింది. జిల్లా అడిషనల్ కలెక్టర్ తిరుపతిరావు ముందే ఆమె ఇలా ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది.

కవాడిపల్లిలోని తమ భూమిపై కొందరు రియల్‌ఎస్టేట్ వ్యాపారులు కన్నేసారని ఆమె ఆరోపించింది. గత కొంతకాలంగా సదరు రియల్‌ఎస్టేట్ వ్యాపారులు ఆభూమిని తమకే విక్రయించాలని ఒత్తిడి చేసినట్లు ఆమె ఆరోపించింది. తాను ఒప్పుకోకపోవడంతో తన భూమిని కాజేసేందుకు యత్నిస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రజాదర్భార్‌లో ఫిర్యాదు చేసేందుకు తాను కలెక్టరేట్‌కు వచ్చినట్లు తెలిపింది. కాగా అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమెను వారించారు. భాధితురాలికి న్యాయం జరిగేవరకూ అండగా నిలుస్తామని వారు భరోసా ఇవ్వడంతో ఆమె శాంతించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News