Sunday, December 22, 2024

అత్తమామల వేధింపులు.. ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మైలార్‌దేవ్‌పల్లి శాస్తీపూరంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వివాహిత రఫియా ఫాతిమా తన గదిలో నుండి ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి అత్తమామలు తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఫ్యాన్ కు వ్రేలాడుతూ కనిపించింది. దీంతో వివాహితను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

తమ కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఫాతిమా తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. భర్త, మరిది, అత్తమామలు చిత్ర హింసలు పెట్టి చంపారని, తమకు న్యాయం చేయాలని ఫాతిమా తల్లిదండ్రులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులను ఆశ్రయించారు. రీ పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఏమైనా చెబితే చంపుతామంటూ అల్లుడు బెదిరిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News