- Advertisement -
హైదరాబాద్: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ గుర్తుతెలియని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…..కేబుల్ బ్రిడ్జి నుంచి నడుచుకుంటు వచ్చిన గుర్తుతెలియని యువతి(30) ఒక్కసారిగి బ్రిడ్జి నుంచి చెరువులోకి దూకింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, డిఆర్‌ఎఫ్ బృందాలు మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వయస్సు 30 ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. మృతిరాలి వివరాలు పూర్తి తెలియలేదని చెప్పారు.
- Advertisement -