మన తెలంగాణ/హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ప్రియాంకరావు(29) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తన ఇంట్లోని బెడ్ రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు చీర బిగించి దాంతో మెడకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. సుల్తాన్ బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కోఠిలోని కుత్బీగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ప్రియాంక రావు భర్త రమేష్ బుధవారం ఉదయం రమేష్ వారి బిడ్డతో కలిసి బయటకు వెళ్లాడు. బిడ్డను స్కూల్లో దింపి, తాను తన పనికని వెళ్లిపోయాడు. తిరిగి సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. ఎంతకీ తలుపు తెరుచుకోకపోవడంతో డోర్ బద్దలుకొట్టిలోనికి వెళ్లి చూడగా భార్య ప్రియాంకరావు సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని విగతజీవిగా పడి ఉంది. కాగా, ఈ ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Woman Suicide in Sultan Bazaar