- Advertisement -
మేడ్చల్: జిల్లాలోని శామీర్ పేటలో దారుణ ఘటన జరిగింది.శామీర్ పేట మండలంలోని పొన్నాలలో ఎర్రగుంట చెరువులో ఆదివారం ఉదయం గుర్తుతెలియని ఓ యువతి మృతదేహం లభించింది. దుండగలు, యువతి చేతులు కట్టేసి చెరువులో పడేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
Woman suspicious dead in Medchal
- Advertisement -