Monday, January 20, 2025

అనుమానాస్పదంగా మహిళ మృతి..

- Advertisement -
- Advertisement -

Woman Suspicious death in Shabad mandal

మన తెలంగాణ/షాబాద్: అనుమానాస్పదంగా మహిళ మృతి చెందిన సంఘటన షాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆదివారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం… కొందుర్గు మండలం రేగడిచిల్కమర్రి గ్రామానికి చెందిన పెద్దింటి యాదయ్యకు నర్సమ్మ (35)తో మూడువ వివాహం చేశారు. గత నెల 29న మీ అక్క కనపడడంలేదని బావమరిది మహేష్‌కు ఫోన్ చేసి చెప్పాడు. అప్పటి నుండి బంధువుల వద్ద, చుట్టుపక్కల ఎంత వెతికిన ఆచూకి లభించలేదు. అయితే ఆదివారం షాబాద్ మండలం బొబ్బిలి గ్రామ శివారులో గల కుంటలో నర్సమ్మ అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించింది. మృతదేహన్ని వెలికి తీసీ పోస్టుమార్టర్ నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నర్సమ్మ తమ్ముడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Woman Suspicious death in Shabad mandal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News