Saturday, December 21, 2024

తిరుపతిలో హృదయ విదారక ఘటన..

- Advertisement -
- Advertisement -

చిత్తూరు: తిరుపతిలోని విద్యానగర్‌ కాలనీలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తల్లి మృతదేహంతోనే కుమారుడు నాలుగు రోజులు ఉండడం అక్కడి స్థానికుల్లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కొంత కాలంగా రాజ్యలక్ష్మి తన భర్తకు దూరంగా కుమారుడితో కలిసి విద్యానగర్‌ కాలనీలో నివాసం ఉంటుంది. నగరంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఆమె టీచర్ గా పని చేస్తోంది. ఈ నెల 8న ప్రమాదవశాత్తు రాజ్యలక్ష్మి ఇంట్లో కిందపడిపోయి మృతిచెందింది. అయితే, అమ్మ నిద్ర పోతోందని భావించిన ఆమె కుమారుడు శ్యామ్ కిషోర్‌ నాలుగు రోజులుగా పాఠశాలకు వెళ్లొస్తున్నాడు. ఇంట్లో ఉన్న తినుబండారాలతో నాలుగు రోజులు గడపడంతో పాటు తల్లి మృతదేహం పక్కనే పడుకున్నాడు. రోజులు గడుస్తుండడంతో తల్లి మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో తన మేనమామ దుర్గాప్రసాద్‌కు శ్యామ్ కిషోర్‌ చెప్పాడు. దీంతో ఇంట్లో రాజ్యలక్ష్మి మృతదేహాన్ని చూసిన దుర్గాప్రసాద్‌ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. శ్యామ్ కిషోర్ మానసిక స్థితి సరిగా లేదని, అందుకే ఇలా జరిగిందని దుర్గాప్రసాద్‌ చెబుతున్నాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Woman Suspicious Death in Tirupati

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News