Saturday, March 1, 2025

మాస్ కాపీయింగ్‌కు టీచర్ సాయం

- Advertisement -
- Advertisement -

బోర్డ్ ఎగ్జామ్స్‌లో మాస్ కాపీయింగ్‌కు టీచర్ సాయం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెను విధుల నుంచి తొలగించిన సంఘటన మధ్య ప్రదేశ్‌లో జరిగింది. బేతుల్ జిల్లా లోని ఓ పాఠశాలలో ఇటీవల 5 వ తరగతి బోర్డ్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షహాలులో సంగీతా విశ్వకర్మ అనే ఉపాధ్యాయురాలిని ఇన్విజిలేటర్‌గా నియమించినట్టు గిరిజనశాఖ సహాయ కమిషనర్ శిల్పాజైన్ తెలిపారు. లెక్కల పరీక్ష జరుగుతున్న సమయంలో విద్యార్థులు సమాధానాల కోసం పలుమార్లు ఆమెను అభ్యర్థించడంతో ఆమె బోర్డుపై జవాబులు రాసి విద్యార్థులు వాటిని ఎక్కించుకోవడానికి సాయం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బేతుల్ కలెక్టర్ నరేంద్ర కుమార్ సూర్యవంశీ ఆ ఉపాధ్యాయురాలిని విధుల నుంచి బహిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News