Monday, November 18, 2024

శత్రువులతో మాట్లాడిందని భార్యను కర్రతో కొట్టి… ఈడ్చుకెళ్లి

- Advertisement -
- Advertisement -

Woman thrashed talking rival family

అహ్మదాబాద్: శత్రువులతో మాట్లాడిందని భార్యను కర్రతో కొట్టి అనంతరం ఆమెను లాక్కెళ్లి శత్రువుల ఇంటి ముందు పడేసిన సంఘటన గుజరాత్ రాష్ట్రం దహోద్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… భూముల విషయంలో మఖ్లా వాల్వాయ్ కుటుంబానికి, భదోర్ కుటుంబానికి గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో రెండు కుటుంబాలు మాట్లాడుకోవడంలేదు. భదోర్ కుటుంబ సభ్యులతో మఖ్లా అనే మహిల మాట్లాడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో వెంటనే ఆమెను బయటకు లాక్కొచ్చి కర్రతో విచాక్షణరహితంగా కొట్టాడు. భదోర్ కుటుంబం ఈ దుశ్చార్యను ఆపటానికి ప్రయత్నించినప్పటికి సాధ్యం కాలేదు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఈడ్చుకుంటూ తీసుకొచ్చి భదోర్ ఇంటి ముందు పడేశాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News