Thursday, December 26, 2024

నగ్న వీడియోలతో విద్యార్థిని బెదిరించిన మహిళ

- Advertisement -
- Advertisement -

Those who record nude calls are making huge money

 

వెస్ట్ గోదావరి: ఓ మహిళ విద్యార్థిని లొంగదీసుకొని అనంతరం అతడి నగ్న వీడియోలు తీసుకొని బెదిరించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లి మండలంలో జరిగింది. బిబిఎ చదువుతున్న ఓ యువకుడికి గుర్తు తెలియని మహిళ పోన్ చేసింది. సదరు మహిళ యువకుడితో పరిచయం పెంచుకొని పలుమార్లు లోబరుచుకుంది. నగ్న వీడియోలు తీసి పంపాలని పలుమార్లు అతడిని కోరింది. నగ్న వీడియో తీసి అతడు ఆమెకు పంపాడు. ఆ వీడియో అడ్డం పెట్టుకొని డబ్బులిస్తేనే వీడియోలు ఇస్తానని లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేస్తాననడంతో అతడు ఎనిమిది వేల రూపాయలు ఆమెకు పంపాడు. ఇంకా డబ్బులు ఇవ్వాలని ఆమె బెదిరిస్తుండడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News