Monday, December 23, 2024

అప్పుడు కుమారుడిని చంపి?…. ఇప్పుడు పసికందును చంపిన కసాయి తల్లి….

- Advertisement -
- Advertisement -

ముంబయి: 39 రోజుల పసికందును 14వ అంతస్తు నుంచి కసాయి తల్లి పడేసిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సబర్బన్ ములుంద్ వెస్ట్‌లోని జావేర్ రోడ్డులో ఓ ఆపార్ట్‌మెంట్‌లో ఓ కుటుంబ నివసిస్తుంది. 39 రోజుల క్రితం దివ్యాంగురాలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం పసికందును 14వ అంతస్తు నుంచి కింద పడేసింది. స్థానికులు పసికందును ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి తల్లిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు కన్నకూతురును కసాయి తల్లి హత్య చేసిందో తెలియడంలేదు. 2022 జులైలో ఆమెకు పుట్టిన ఏడు నెలలబాబు గొంతులో ఆహారం ఇరుక్కొని చనిపోయాడు. దీంతో రెండు ఘటనలపై పోలీసులు అనుమానాలు రావడంతో దీనిపై కూడా విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News