Sunday, January 19, 2025

చెట్టుకు కట్టేసి కన్నతల్లి సజీవదహనం

- Advertisement -
- Advertisement -

కన్న తల్లిని చెట్టుకు కట్టేసి ఆమె ను సజీవ దహనం చేశారు ఇద్దరు కుమారులు, కోడలు. ఈ అమానవీయ ఘటన పశ్చిమ త్రిపురలోని చంపక్‌నగర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మినాటీ దేబ్‌నాథ్ అనే 55 ఏళ్ల మహిళను ఆమె ఇద్దరు కుమారులు రణబీర్ దేబ్‌నాథ్, బిప్లబ్ దేబ్‌నాథ్, రణబీర్ భార్య కలసి తమ ఇంటి వెనుక ఉన్న చెట్టుకు కట్టేసి సజీవంగా దహనం చేశారు.

కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మినాటీ దేబ్‌నాథ్ భర్త 2022లో చనిపోయాడు. ఆమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అగర్తలలో ఉంటున్నాడు. ఆమె తన ఇద్దరు చిన్నకుమారుల వద్ద ఉంటోంది. స్థానికుల నుంచి సేకరించిన ప్రకారం మినాటీకి అక్రమ సంబంధం ఉందని, ఈ కారణంగానే ఆమె ఇద్దరు కుమారులు ఆమెను హత్యచేశారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News