Wednesday, January 1, 2025

శంషాబాద్ లో దారుణ సంఘటన…

- Advertisement -
- Advertisement -

Minor boy rapes girl in Madannapet

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. సాజిద్ అనే యువకుడు సోషల్ మీడియాలో పరిచయమైన ఓ యువతిని ట్రాప్ చేశాడు. ఆ తర్వాత యువతి న్యూడ్ కాల్ మాట్లాడాలని సాజిద్ ఒత్తిడి చేశాడు. దీంతో న్యూడ్ కాల్ మాట్లాడిన యువతిపై సాజిద్ బెదిరింపులకు పాల్పడ్డాడు. తాను చెప్పిన చోటుకు రాకపోతే న్యూడ్ కాల్ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరించి యువతిని రాజేంద్ర నగర్ కు రప్పించాడు. తర్వాత ఓ రూమ్ లోకి తీసుకెళ్లి బంధించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో యువతి అరుపులు కేకలు విన్న స్థానికులు వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడు సాజిద్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Woman Trapped and Raped in Shamshabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News