Tuesday, December 24, 2024

ట్యాంక్‌బండ్‌లో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు మంగళవారం యత్నించింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు స్పందించి మహిళను కాపాడి బయటికి తీసుకుని వచ్చారు. పోలీసుల కథనం ప్రకారం…ఓ మహిళ హుస్సేన్‌సాగర్‌లో దూకింది. ఇది గమనించిన అక్కడ ఉన్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులు, ట్యాంక్ బండ్ శివ కలిసి ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. శివ వెంటనే హుస్సేన్‌సాగర్‌లోకి దూకి మహిళను బయటకు తీసుకొచ్చాడు. మహిళ ప్రాణాలతో ఉండడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది. మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News