Wednesday, January 22, 2025

యువతిపై ఏడాదిగా ముగ్గురు పోలీస్‌ల లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

జైపూర్ : ముగ్గురు పోలీస్‌లు ఒక యువతిపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు తన తల్లితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ముగ్గురు పోలీస్‌లపై కేసు నమోదైంది. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది నవంబర్‌లో తాను మైనర్‌గా ఉన్నప్పుడు ముగ్గురు కానిస్టేబుళ్లు మొదట అత్యాచారానికి పాల్పడ్డారని 18 ఏళ్ల యువతి తెలిపింది. అప్పటి నుంచి ఏడాదిగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్టు ఆరోపించింది.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తన సోదరుడిపై తప్పుడు కేసు నమోదు చేస్తామని ఆ పోలీస్‌లు బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొంది. అల్వార్ జిల్లా ఎస్పీ ఆనంద్‌శర్మ ఈ సంఘటనపై స్పందించారు. నిందితులైన ముగ్గురు కానిస్టేబుల్స్ రాయిని పోలీస్ స్టేషన్‌లో , రాజ్‌గఢ్ సర్కిల్ ఆఫీసర్ కార్యాలయంలో , మలఖేడా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వారిని పోలీస్ లైన్స్‌కు అటాచ్ చేశారు. నిందితులపై పోక్సో చట్టంతోపాటు సామూహిక లైంగిక దాడి వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News