Wednesday, January 22, 2025

గాంధీనగర్ నాలాలో కోట్టుకుపోయిన మహిళ మృతదేహాం లభ్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రమాదవశాత్తు నాలాలో పడి గల్లంతైన మహిళ మృతదేహం ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద బుధవారం ఉదయం లభించింది. జిహెచ్‌ఎంసి సిబ్బంది చెత్త తొలగిస్తున్న సమయంలో మహిళ మృతదేహం కన్పించింది. ఈ విషయం వెంటనే అధికారులకు చెప్పడంతో వారు వచ్చిన పరిశీలించి గాంధీనగర్ నాలాలో పడిపోయిన లక్ష్మిగా గుర్తించారు. మె కూతురుకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన ఆమె లక్ష్మి మృతదేహాన్ని గుర్తించింది. బ్రిడ్జి వద్దకి వచ్చిన క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని సోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి పోలీసులు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News